అమెరికాలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

అమెరికాలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు అమెరికాలోని అట్లాంటాలో ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ అమెరికా పరివార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జార్జియా ఇన్సురెన్స్ కమీషనర్ జాన్ కింగ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శివాజీ విగ్రహంతోపాటు రాణాప్రతాప్, ఝాన్సీ లక్ష్మిబాయి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తన పరాక్రమంతో శత్రువుల గుండెల్లో దడపుట్టించిన చరిత్ర వీరుడు శివాజీ జయంతిని నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. నైతిక విలువలు కల్గిన గొప్పనాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు. శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story