మున్సిపల్‌ కార్పోరేషన్ల ఎన్నికలకు వెల్లువలా నామినేషన్లు

మున్సిపల్‌ కార్పోరేషన్ల ఎన్నికలకు వెల్లువలా నామినేషన్లు

ఏపీలో మున్సిపల్‌ కార్పోరేషన్ల ఎన్నికలకు నామినేషన్లు పెద్దఎత్తున దాఖలు చేస్తున్నారు వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో... నామినేషన్లు ఊపందుకుంటున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటిగిరి మున్సిపాలిటిలో ఇప్పటివరకు వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు 19 నామినేషన్లు దాఖలయ్యాయిరు. వైసీపీ 5, టీడీపీ 12, సీపీఐ 1, స్వతంత్రులు ఒకరు కౌన్సిలర్‌కు నామినేషన్‌ దాఖలు చేశారు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌లో ఇప్పటివరకు 25 వార్డులకు గాను 21 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నరు. ఇవాళే ఆఖరి రోజుకావడంతో.. అధిక సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్‌ వేసే అవకాశాలున్నాయి.

అటు విజయనగరంలో మున్సిపల్ కార్పోరేషన్‌ నామినేషన్లు కొనసాగుతున్నాయి. 50 వార్డులకు గాను... ఇప్పటివరకు 150 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు బీజేపీ, జనసేన, స్వంతత్ర అభ్యర్ధులు నామినేషనలు వేసేందుకు ఉత్సాహం చూపారు. పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు వస్తుండటంతో... వారిని కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేస్తున్నారు పోలీసులు..

ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పోరేషన్‌కు డివిజన్‌ కార్పోరేటర్ల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వైసీపీ మేయర్‌ అభ్యర్ధిగా 18వ డివిజన్‌ నుంచి గంగాడ సుజాత పోటీ చేస్తూ నామినేషన్‌ దాఖలు చేశారు. కార్పోరేషన్‌ పరిధిలో 90 శాతం తమ పార్టీ అభ్యర్ధులు కార్పోరేటర్లుగా గెలుపొందుతారని ఆశబావం వ్యక్తం చేశారు

అటు ఈ ఎన్నికలు పశ్చిమగోదావరి జిల్లాలో అధికార వైసీపీలో చిచ్చు రాజేస్తున్నాయి. ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.నగర మేయర్‌ పదవిని ఆశించి భంగపడ్డ బొద్దాని శ్రీనివాస్‌ అనే వైసీపీ నేత కన్నీటి పర్యంతమయ్యారు.. శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో డిప్యూటీ సీఎం ఇంటి దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ను ఏలూరు కార్పొరేషన్‌ వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో వివాదం రాజుకుంది

మిగిలిన జిల్లాలోనూ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్ధులు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్ధులు.

Tags

Next Story