ఎక్కువ కరోనా కేసులు అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి: ఆళ్ల నాని
BY TV5 Telugu28 March 2020 7:22 PM GMT

X
TV5 Telugu28 March 2020 7:22 PM GMT
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులన్నీ అర్బన్ ప్రాంతాల్లోనే నమోదయ్యాయన్నారు ఏపీ మంత్రి ఆళ్ల నాని. ఇప్పటివరకు నమోదైన 13 పాజిటివ్ కేసుల్లో 12 మంది అర్భన్ ప్రాంతాల్లోనివేనన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి చర్చించామన్నారు. అవసరమైన వారిని అసోలేషన్ వార్డులకు తరలిస్తామన్నారు. విదేశాల్లోనుంచి 29264 మంది వచ్చినట్లు గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారో తెలుసుకునేందుకు మరోసారి సర్వే నిర్విహిస్తామన్నారు మంత్రి ఆళ్ల నాని.
14 రోజుల క్వారంటైన్‌కు ఒప్పుకుంటే రాష్ట్రంలో వచ్చేందుకు అంగీకరిస్తామన్నారు మంత్రి బొత్స. నిత్యావసరాలు సరఫరా చేసేందుకు మొబైల్ షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు బజార్లు మరిన్ని పెంచుతామన్నారు మంత్రి బొత్స.
Next Story