9 April 2020 8:39 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఇరాన్‌లో 4000 దాటిన...

ఇరాన్‌లో 4000 దాటిన కరోనా మరణాలు

ఇరాన్ లో కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఈ మేరకు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 117 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మరణాల సంఖ్య దేశవ్యాప్తంగా 4,110కు చేరుకుంది. కానీ, తాజాగా నమోదైన కరోనా వ్యాధుల సంఖ్య మాత్రం గతంతో పోలిస్తే తగ్గాయని తెలిపారు.

కొత్తగా 1,634 కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు సంఖ్య 66,220కి చేరింది. ఇలాగే కేసులు తగ్గించుకొనేందుక కృషి చేస్తాము. గత 24 గంటలు 117 మందిని కోల్పోయాము. ఇది చాలా దురదృష్టకరము. కానీ, మా ప్రజలను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు.

Next Story