టీఎస్‌ఎంసెట్‌తో పాటు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

టీఎస్‌ఎంసెట్‌తో పాటు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
X

తెలంగాణ సర్కార్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఆయన వెల్లడించారు. మే నెలలో నిర్వహించాల్సిన టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌.. వంటి అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షల దరఖాస్తుల గడువు తేదీని కూడా మే ఐదు వరకు పొడిగించినట్టు తెలిపారు. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కోరారు.

Tags

Next Story