28 April 2020 5:46 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / తగినన్ని పిపిఇ కిట్లు...

తగినన్ని పిపిఇ కిట్లు ఇవ్వడంలేదని వైద్యుల వినూత్న నిరసన

తగినన్ని పిపిఇ కిట్లు ఇవ్వడంలేదని వైద్యుల వినూత్న నిరసన
X

కరోనావైరస్ పై పోరాటంలో ప్రపంచం నలుమూలల నుండి వైద్యులు నిమగ్నమై ఉన్నారు. అయితే జర్మనీకి చెందిన వైద్యుల బృందం తగినన్ని పిపిఇ కిట్లు లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రేయింబవళ్లు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం చేస్తున్న తమకు పిపిఇ కిట్లు ఇవ్వడంలేదని నగ్న ప్రదర్శన ఇచ్చారు. ఈ నిరసనకు వైద్యులు 'బ్లాంకే బాడెన్కెన్' అని పేరు పెట్టారు. సేఫ్టీ కిట్ లేకుండా అంటువ్యాధికి ఎలా వైద్యం చేస్తారని గ్రూప్ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పిపిఇ కిట్ల కొరత గురించి గతంలో చాలా సార్లు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వారు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని. ఈ బృందంతో సంబంధం ఉన్న డాక్టర్ రూబెన్ బర్నావ్ అన్నారు. తమ బృందానికి తగినంత భద్రతా వస్తు సామగ్రి లేదని.. అందువల్ల నగ్నంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. కాగా జర్మన్ వైద్యులు జనవరి నుండి అధిక సంఖ్యలో పిపిఇ కిట్లను అడుగుతున్నారు.

అయితే భద్రతా వస్తు సామగ్రిని ఉత్పత్తి చేసే జర్మన్ సంస్థలు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాయి. అయినప్పటికీ, వారు డిమాండ్‌ను తీర్చలేకపోతున్నారు. క్లినిక్ లు, కేర్ హోమ్స్ డైలీ మాస్కులు, అద్దాలు, ఆప్రాన్లను డిమాండ్ చేస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వారి అవసరాలు తీర్చడం కోసం కంపెనీలు కూడా పెద్దఎత్తున కృషి చేస్తున్నాయని ప్రభుత్వ

అధికారులు చెబుతున్నారు.

Next Story