అంతర్జాతీయం

కిమ్ రాజకీయ వారసుడు ఆయనే అట..!

కిమ్ రాజకీయ వారసుడు ఆయనే అట..!
X

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంపాలైన సంగతి తెలిసిందే. గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని రిసార్టులో విశ్రాంతి తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తెలియలేదు కానీ.. కిమ్ మరణించారన్న రూమర్లు మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నాయి.. ఈ క్రమంలో తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆ దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కిమ్ వారసురాలిగా ఆయన సోదరి వ్యవహరిస్తారని అనుకుంటున్నారు.. అయితే ఈ చర్చ కొద్ది రోజులు మాత్రమే సాగింది. ఇప్పుడు కిమ్ మామ.. కిమ్ ప్యోంగ్ యుల్ దీనికి సరైన వ్యక్తి అని అనుకుంటున్నారు. 65 ఏళ్ల కిమ్ ప్యోంగ్ ఇల్ ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ చివరి సంతానం. ఆయన ఉత్తర కొరియా వెలుపల ఉన్న దేశాలలో దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నత చదువులు చదివి విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించారని అంటున్నారు. కిమ్ ఇల్ సుంగ్ హంగరీ, బల్గేరియా, ఫిన్లాండ్, పోలాండ్ , చెక్ రిపబ్లిక్ లకు ఉత్తర కొరియా రాయబారిగా పనిచేశాడు.

అయితే కిమ్ ప్యోంగ్ గత సంవత్సరం పదవీ విరమణ చేసిన తరువాత దేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 న తన తాత కిమ్ ఇల్ సుంగ్ జ్ఞాపకార్థం వార్షిక కార్యక్రమానికి కిమ్ జోంగ్ హాజరుకాలేదు. ఆ తరువాత, అతని ఆరోగ్యం గురించి అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కిమ్ ఇల్ సుంగ్ మాత్రం హాజరు అయ్యారు.. దాంతో చర్చనీయాంశంగా అయింది. అయితే కొంతమంది నిపుణులు మాత్రం కిమ్ ప్యోంగ్ అధికారం చేపడతారన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. కిమ్ ప్యోంగ్ చాలా కాలంగా దూరంగా ఉన్నారని.. దేశ పాలనా వ్యవస్థ , మీడియాపై పట్టు లేదని.. దక్షిణ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు కామ్ బ్యోంగ్ చెప్పారు.. అంతేకాదు ఈ రూమర్లు తనకు నవ్వు తెప్పిస్తున్నాయని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Next Story

RELATED STORIES