ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు : నాదెండ్ల మనోహర్

ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు : నాదెండ్ల మనోహర్
X

ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా మూలంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితులివి... ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది... ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తెలియచేస్తే పాలకులు స్వీకరించాలి అని మనోహర్‌ సూచించారు. ఈ తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరితోనే వ్యవహరించడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలను తెలిసినా, ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడినా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో కేసులుపెడుతోంది... ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని చెప్పారు. శనివారం

సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు మనోహర్.

Next Story

RELATED STORIES