రష్యాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో..

రష్యాలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో..

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు రెండు లక్షల 48 వేల 653 మంది మరణించారు. 35 లక్షల 84 వేల 116 మందికి ఈ వ్యాధి సోకింది, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 లక్షల 61 వేల 677 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొదట్లో సైలెంట్ గానే ఉన్న ఈ వైరస్ రష్యాలో ప్రస్తుతం విజృంభిస్తోంది. అక్కడ 24 గంటల్లో 10 వేల 581 కొత్త కేసులు వచ్చాయి. దీంతో ఇక్కడ మొత్తం లక్షా 45 వేల 268 మంది రోగులు కనుగొనబడ్డారు. ఇక్కడ ఇప్పటివరకూ మొత్తం 1356 మంది ఇక్కడ మరణించారు. ఆ దేశంలో మాస్కో ఎక్కువగా ప్రభావితమైంది.

ఇదిలావుంటే బాన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, జర్మనీలోని చాలా మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు సరిగ్గా జరగలేదు. కాబట్టి అక్కడ కేసులు ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా పదిరెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు చైనాలోని వుహాన్ నగరంతో పాటు, దక్షిణ కొరియాలో ఎంపిక చేసిన పాఠశాలలు కూడా తిరిగి ఓపెన్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story