సౌదీలో చిక్కుకున్న తెలుగువారిని..

సౌదీలో చిక్కుకున్న తెలుగువారిని..

విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. వందే భారత్ మిషన్ రెండో విడతలో భాగంగా మే 20న సౌదీ అరేబియా నుంచి విజయవాడకు ప్రత్యేక విమానం నడపనున్నట్లు ఎయిర్ ఇండియా వెస్టర్న్ రీజియన్ మేనేజర్ చందన్ ప్రభు తెలిపారు. మొదటి విడతలో కేంద్రం అబుదాబీ, కువైట్‌ల నుంచి హైదరాబాద్‌కు రెండు విమానాలను ఒకసారి, ఐదు విమానాలను ఒకసారి కేటాయించింది. అయితే వాటిల్లో తెలుగువారికి అవకాశం రాకపోవడంతో నిరాశ చెందారు.

ఇప్పుడు రెండో విడతలో హైదరాబాద్‌కు విమానాన్ని కేటాయించడంతో తెలుగు వారు ఆనందం వ్యక్తం చేశారు. చందన్ ప్రభు అందించిన వివరాల ప్రకారం.. ఏఐ 1914 విమానం మే 20వ తేదీన జెడ్డా నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. ఇదే విమానంలో ప్రయాణించే తెలంగాణ వారిని విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ1407 విమానంలో హైదరాబాద్‌కు చేర్చనున్నారు. కాగా, మొదటి విడతలో ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారిని, గర్భంతో ఉన్న వారికి, వయసు పైబడిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి భారత దౌత్యవేత్తలు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story