ఆంధ్రప్రదేశ్

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై స్పందించిన యాజమాన్యం

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై స్పందించిన యాజమాన్యం
X

ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ దుర్ఘటనపై యాజమాన్యం స్పందించింది. ప్రభావిత గ్రామాలను ఆదుకునేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తామని యాజమాన్యం వివరించింది. ఇప్పటికే ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. గ్రామాల్లో ఆరోగ్య పరీక్షల కోసం సురక్ష హాస్పిటల్స్‌లో అన్ని సౌకర్యలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు రెండు ఫోన్‌ నంబర్లను (0891-2520884, 0891-2520338) కూడా ఇచ్చారు. ప్రమాదం తర్వాత పరిస్థితులపై ప్రత్యేక సంస్థతో సర్వే చేయిస్తామని కూడా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తాము చేపడతామని పేర్కొంది

Next Story

RELATED STORIES