ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ !

ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ !

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. వ్యాక్సిన్ కనుక్కొనే పనిలో పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. పలు సంస్థలు మెడిసిన్ పై ట్రైల్స్ కూడా చూస్తున్నారు. తాజాగా ఆక్స్‌ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఏజెడ్‌డీ 1222 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తుంది. పలువురు ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికి వస్తుందని చెబుతున్నాయి. ఇక ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ఈ టీకాను విజయవంతంగా, త్వరగా మార్కెట్ లోకి తెచ్చేందుకు యూరప్ దేశాలు ఆక్స్‌ఫర్డ్‌కు సహాయాన్ని అందిస్తున్నాయి. ఇదే వ్యాక్సిన్ ను భారత్ సహా పలు దేశాలు తయారు చేస్తున్నాయి. పలు దేశాలు ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ముందుగా కొంతమంది మీద ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని.. ఇక ఈ సారి వేలాదిమందిపై ప్రయోగించామని.. అయితే, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే టీకా గురించి మాట్లాడిన ప్రపంచఆరోగ్య సంస్థ టెస్టింగ్ చివరి దశకు వచ్చిందని.. ఈ ఏడాది చివరిలో మార్కెట్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story