టెక్కీల దృష్టిని ఆకర్షిస్తున్న కెనడా

టెక్కీల దృష్టిని ఆకర్షిస్తున్న కెనడా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసాల విషయంలో చేస్తున్న ప్రకటలతో టెక్ ఉద్యోగుల దృష్టిని కెనడా ఆకర్శిస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. 2017లో ప్రారంభించిన గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ ద్వారా కెనడా మూడేళ్లలో ఐదు రెట్లు ఎక్కవ మందికి వీసాలు జారీ చేసిందని ఆ దేశ ఇమిగ్రేషన్, వలసదారులు, పౌరసత్వ సంస్థ తెలిపింది. సాఫ్ట్ వేర్ లో పలు కేటగిరిలకు చెందిన 23వేల మందికి కెనడా వీసాలు ఇచ్చినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదటి త్రైమాశకంలో కూడా రెండువేలకు పైగా అప్లికేషన్లు ఆమోదం పొందాయని తెలిపింది. అప్లికేషన్ పెట్టుకున్న రెండువారాల్లోనే ప్రాసెసింగ్ పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ ఏడాది కరోనా ప్రభావం వలన అప్లికేషన్లు బాగా తక్కవగా వస్తున్నాయని అన్నారు.

అయితే, కెనడా నుంచి ఎక్కవగా వీసాలు పొందుతున్న వారిలో ఇడియన్లు ఎక్కువగా ఉన్నారని.. 62 శాతం వారే ఉన్నారని తెలిపింది. తరువాత చైనా నుంచి ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయని.. అమెరికన్లుకు కూడా వెయ్యి వీసాలు జారీ అయ్యాయని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story