6 July 2020 5:24 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / అమెరికాలో మరో...

అమెరికాలో మరో ప్రాణాంతక వ్యాధి

అమెరికాలో మరో ప్రాణాంతక వ్యాధి
X

అగ్రరాజ్యం అమెరికాలకు కరోనాతో పాటు కొత్తగా మరో ముప్పు వచ్చి పడింది. ప్లోరిడాలో ఓ వ్యక్తికి మెదడుకి సంబంధించిన వ్యాధి ఒకటి సోకింది. ఇది అమీబాతో ఈ ఇన్ఫెక్షన్ సోకిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అమీబా సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువల్లోని వెచ్చటి తాజా నీళ్లలో ఉంటుందని తెలిపారు. ఈ నీళ్లు ముక్కుకు తగలడం వలన ఈ అమీబా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని.. అందుకే ఈ నీళ్లు ముక్కుకు తగలకుండా జాగ్రత్తపడాలని అన్నారు. ఇది ఎక్కువగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే విస్తృతంగా వ్యాపిస్తుందని అధికారులు తెలిపారు.

Next Story