అంతర్జాతీయం

అగ్రరాజ్యంలో కరోనా.. రాష్ట్ర గవర్నర్ కి పాజిటివ్

అగ్రరాజ్యంలో కరోనా.. రాష్ట్ర గవర్నర్ కి పాజిటివ్
X

అగ్రరాజ్యం అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టిట్ కి కరోనా సోకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీకి హాజరైన రెండు వారాల తరువాత వైరస్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు గవర్నర్ బుధవారం ప్రకటించారు. ఓక్లహోమాలో కేసులు పెరిగాయి. జూన్ లో ట్రంప్ నిర్వహించిన ఇండోర్ ర్యాలీతో పాటు ప్రజా నిరసనలు కేసుల పెరుగుదలకు దోహదపడ్డాయని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన మొదటి యుఎస్ గవర్నర్ తాను అని గవర్నర్ కెవిన్ స్టిట్ చెప్పారు. 47 ఏళ్ల కెవిన్ కుటుంబానికి దూరంగా నిర్బంధంలో ఉన్నారు. వైరస్ నుండి విముక్తి పొందే వరకు ఇంటి నుండి పని చేస్తానని చెప్పాడు. ట్రంప్ ర్యాలీలో ఒక్కసారి కూడా మాస్క్ ధరించలేదు. కానీ తనే కొవిడ్ బారిన పడేసరికి ఇప్పుడు ప్రజలందరికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. వైరస్ ఓక్లహోమాలో ఉందని తెలుసు. దాన్నుంచి తప్పించుకోగలమని అనుకున్నాము. కరోనాని తక్కువ అంచనా వేశామని స్టిట్ అంటున్నారు.

ఈ వైరస్ ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓక్లహోమన్లు ​​పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రద్దీగా ఉండే ఇండోర్ లో ర్యాలీని నిర్వహించాలని పట్టుబట్టినందుకు ట్రంప్ పెద్ద దెబ్బ తిన్నారు. అతని ప్రచారం కార్యక్రమంలో మాస్కులు ఇచ్చారు కానీ హాజరైన కొంతమంది మాత్రమే వాటిని ధరించారు. అంతే కాకుండా సామాజిక దూర మార్గదర్శకాలను సైతం విస్మరించారు అని ఆయన పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES