ముంబైలో భారీ వర్షాలు.. జాతీయ రహదారి మూసివేత

ముంబైలో భారీ వర్షాలు.. జాతీయ రహదారి మూసివేత

ముంబై మహానగరం అటు కరోనా, ఇటు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేని వర్షాలతో రాయగడ్ లోని కల్మాజీ బ్రిడ్జి వద్ద గోడ్ నది పొంగి ప్రవహిస్తుంది. దీంతో ముంబై-గోవా జాతీయ రహదారిని మూసివేశారు. ముంబై నుంచి వచ్చే వాహనాలను నిజాంపూర్ వద్ద మళ్లించి.. భీరనాకా మీదుగా పంపిస్తున్నామని హైవే సేఫ్టీ పెట్రోల్ ఎస్పీ విజయ్ పాటిల్ చెప్పారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో సావిత్రినదితో వరద నీరు ఎక్కువ వేగంతో ప్రవహిస్తుందని.. ఎవరూ నదిలో ఈత కొట్టవద్దని కోరారు. అటు, మాంగావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల బాలుడు నదిలో దిగి వరదనీటిలో మరణించాడు. దీంతో రాయగఢ జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అటు వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. మంగోన్ తాలూకాలోని సోనియాచి వాడి గ్రామంలో ముంపునకు గురవడంతో 86 మందిని పడవల సాయంతో సురక్షితప్రాంతాలకు తరలించామని రాయ్ గడ్ పోలీసులు చెప్పారు.

Tags

Next Story