ఒడిశాలో భూప్రకంపనలు

ఒడిశాలో భూప్రకంపనలు
X

ఒడిశాలో భూకంపం సంభవించింది. బెర్హాంపూర్‌లో శనివారం ఉదయం రిక్టార్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. సుమారు ఉదయం 7గంటల సమయంలో బెర్హాంపూర్‌కు 73 కిలోమీటర్లలోని దక్షిణ నైరుతి ప్రాంతంలో ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనతో ఇళ్లనుంచి బయటకు పరుగులుత తీశారు. అయితే, భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలో ఇటీవల తరచూ భూమి కంపిస్తుంది. కాగా.. శనివారం తెల్లవారు జామున మేఘాలయలో భూకంపం సంభవించింది. కరోనాకు తోడు, తరుచూ ఏర్పడుతున్న ఈ భూకంపం అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది.

Tags

Next Story