తాత్కాలికంగా మూతపడ్డ కోజికోడ్ విమానాశ్రయం

కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరగడంతో తాత్కాలికంగా విమానశ్రయం మూసివేశారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కోజికోడ్ కు రానున్న విమానాలను కన్నూర్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు మళ్లిస్తారు. కాగా.. ఈ ప్రమాదంతో ఓ పైలట్, కో పైలట్ మరణించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కుటుంబాలకు ఎయిర్ ఇండియా వారి కుటుంబ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రమాద దర్యాప్తు విభాగం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమగ్ర దర్యాప్తు సాగిస్తోంది. డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్, ఫ్లోరు బోర్డు నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డరులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేసేందుకు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ సహాయపడుతుందని విమానయాన శాఖ అధికారులు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com