పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుషం

పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుషం

పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. కరోనా వచ్చిందని మహిళను స్మశాన వాటిలో ఉంచేశారు గ్రామ వాలంటీర్లు , anm లు. ఈ ఘటన నిడమర్రు మండలం కొవ్విడులో చోటుచేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన మహిళ కాలువలోకి దూకబోయింది. ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్ కు తరలించారు. గ్రామ కట్టుబాట్ల పేరుతో మహిళలిద్దరిని గ్రామ స్మశానవాటికలో ఉంచడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాలంటీర్లు, anm ల నిర్వాకానికి బాధితులు ఆకలితో అలమటించిపోయారు. తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయారు. ఓ మహిళ వారికి ఆహరం అందించేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ పక్కనే ఉన్న కాలువలో దూకబోయింది. చివరకు తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్ కు బస్సులో పంపారు.

Tags

Read MoreRead Less
Next Story