ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు.. మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు.. మరణాలు..

గత 24 గంటల్లో భారతదేశం 53,601 కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులను, 871 మరణాలను నమోదు చేసినప్పటికీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా నివేదికలో మంగళవారం కోవిడ్ -19 కేసుల సమర్థవంతమైన మరియు సత్వర క్లినికల్ నిర్వహణ కారణంగా భారతదేశ రికవరీ రేటు 69.8 శాతానికి పెరిగిందని చెప్పారు . వైరస్ సోకిన కేసుల నిష్పత్తిలో మరణాలు స్థిరంగా పడిపోతున్నాయని, ఇప్పుడు మొదటిసారిగా 2 శాతం కన్నా తక్కువకు మరణాల సంఖ్య నమోదైందని తెలిపింది. ప్రస్తుతం ఇది 1.99 శాతంగా ఉందని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 22,68,676 కు పెరిగింది. 22,68,676 కేసుల్లో 15,83,490 మంది కోలుకోగా, 28.21 శాతం (6,39,929) మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన మరణాలు 45,257 గా ఉన్నాయి.

కోవిడ్ -19 పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించారు. భారతదేశపు కోవిడ్ -19 కేసులలో 80 శాతం ఉన్న ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్. ఈ సమావేశంలో భారతదేశం సరైన దిశలో పయనిస్తోందని, రాష్ట్రాలు కలిసి పనిచేయడం ద్వారా వైరస్ ను ఓడించవచ్చని పీఎం మోడీ అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారిని పరిష్కరించడానికి కేంద్రం నుండి పెద్దమొత్తంలో ఆర్థిక ప్యాకేజీలను కోరారు.

కాగా,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం మాట్లాడుతూ, కోవిడ్ -19 కోసం తమ దేశం మొదటి టీకాను నమోదు చేసింది. గమేలియా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు రెండు నెలల కన్నా తక్కువ సమయంలోనే పరీక్షలు నిర్వహించి అనుమతి పొందామని తెలిపారు. తన కుమార్తెకు టీకాలు వేసినట్లు పుతిన్ చెప్పారు. త్వరలోనే తమ దేశం వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు మంగళవారం 20,011,186 పెరిగాయని జాన్ హాప్కిన్స్ గణాంకాలు నివేదించాయి. 2019 డిసెంబర్ లో చైయాలో ఉద్భవించిన ఈ వైరస్ 210 దేశాలకు వ్యాపించింది. ఈ వ్యాధి కారణంగా ప్రపంచ మరణాల సంఖ్య దాదాపు 732,000 గా ఉంది. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, భారతదేశంలలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story