CM REVANTH: నెట్‍ఫ్లిక్స్ రాకతో నా కల నిజం కాబోతోంది

నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్‌ ప్రారంభం... ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్.. నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్న

Update: 2026-03-12 11:45 GMT

హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ సాంకేతిక మరియు వినోద రంగాల్లో మరింత ప్రాధాన్యం సంపాదిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ప్రసిద్ధ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయం ప్రారంభం కావడం రాష్ట్రానికి ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ హైటెక్ సిటీలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నెట్‌ఫ్లిక్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అన్ని విధాలుగా అవకాశాలు కల్పించే నగరమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షప్రియో,, ప్రముఖ సినీ నటుడు రానాతదితరులు హాజరయ్యారు. ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యాలయం, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక, మీడియా మరియు వినోద రంగాల అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుందని భావిస్తున్నారు.

దేశంలోనే రెండోది

హై­టె­క్ సి­టీ­లో­ని క్యా­పి­ట­ల్ ల్యాం­డ్ ఐటీ­పీ­హె­చ్ బ్లా­క్–ఏలో సు­మా­రు 40 వేల చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో ఈ కా­ర్యా­ల­యా­న్ని ఏర్పా­టు చే­శా­రు. అమె­రి­కా­కు చెం­దిన ప్ర­ముఖ స్ట్రీ­మిం­గ్ ది­గ్గ­జం నె­ట్‌­ఫ్లి­క్స్‌­కు భా­ర­త­దే­శం­లో ముం­బై తర్వాత ఇది రెం­డో కా­ర్యా­ల­యం కా­వ­డం ప్ర­త్యే­కత. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా సం­స్థ ని­ర్వ­హిం­చే సాం­కే­తిక కా­ర్య­క­లా­పా­ల­కు హై­ద­రా­బా­ద్‌­లో­ని ఈ కేం­ద్రం కీలక పా­త్ర పో­షిం­చ­నుం­ద­ని కం­పె­నీ వర్గా­లు పే­ర్కొం­టు­న్నా­యి. నగ­రం­లో ఉన్న బల­మైన టెక్ మౌ­లిక సదు­పా­యా­లు, ప్ర­తి­భా­వం­తు­లైన యువత మరి­యు ఐటీ రం­గం­లో ఉన్న వి­స్తృత అవ­కా­శా­లే ఈ ని­ర్ణ­యా­ని­కి కా­ర­ణ­మ­ని కం­పె­నీ అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈ కేం­ద్రం ద్వా­రా ప్ర­ధా­నం­గా అధు­నా­తన సాం­కే­తిక పరి­జ్ఞా­నా­న్ని ఉప­యో­గిం­చి ఎడి­టిం­గ్‌, యా­ని­మే­ష­న్‌, రెం­డ­రిం­గ్‌ వంటి సాం­కే­తిక సే­వ­ల­ను ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు సమా­చా­రం. ఈ రం­గా­ల్లో ని­పు­ణు­లైన యు­వ­త­కు పె­ద్ద ఎత్తున ఉపా­ధి అవ­కా­శా­లు లభిం­చే అవ­కా­శం ఉం­ద­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు.

నెట్‌ఫ్లిక్స్‌ రాకతో హైదరాబాద్‌ ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ హబ్‌గా మరింత బలపడుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఉన్న ఆసక్తిని గుర్తు చేసుకున్నారు. కాలక్రమేణా సినిమా పరిశ్రమలో జరిగిన మార్పులు ఆశ్చర్యకరమని ఆయన చెప్పారు. ఒకప్పుడు సాంకేతిక పరంగా పరిమితులు ఉన్నప్పటికీ ఇప్పుడు అత్యున్నత సాంకేతికతతో సినిమాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణగా బాహుబలి, కల్కి, RRR, అరుంధతి వంటి చిత్రాలను ఆయన ప్రస్తావించారు. ఈ సినిమాలు భార చిత్రసీమలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చాయని చెప్పారు. తె­లు­గు సి­ని­మా పరి­శ్ర­మ­ను చె­న్నై నుం­చి హై­ద­రా­బా­ద్‌­కు తీ­సు­కు­వ­చ్చిన మహ­నీ­యు­లైన ఎన్టీ­ఆ­ర్, ఏఎ­న్నా­ర్ల­ను ఈ సం­ద­ర్భం­గా ఆయన స్మ­రిం­చా­రు. వారి కృషి వల్లే హై­ద­రా­బా­ద్‌ సి­ని­మా పరి­శ్ర­మ­కు కేం­ద్ర­బిం­దు­వు­గా మా­రిం­ద­ని తె­లి­పా­రు. ఇప్పు­డు అదే నగరం అం­త­ర్జా­తీయ స్థా­యి వి­నోద రంగ సం­స్థ­ల­ను కూడా ఆక­ర్షి­స్తోం­ద­ని అన్నా­రు. నె­ట్‌­ఫ్లి­క్స్‌ హై­ద­రా­బా­ద్‌­కు రా­వ­డం అంటే హా­లీ­వు­డ్‌ నగ­రా­ని­కి వచ్చి­న­ట్లే­న­ని ము­ఖ్య­మం­త్రి వ్యా­ఖ్యా­నిం­చా­రు. గతం­లో­నే తమ దృ­ష్టి హా­లీ­వు­డ్‌­పై­నే ఉం­ద­ని చె­ప్పా­న­ని, ఇప్పు­డు నె­ట్‌­ఫ్లి­క్స్‌ రా­క­తో ఆ కల నె­ర­వే­రు­తు­న్న­ట్లు­గా ఉం­ద­ని తె­లి­పా­రు. రా­ష్ట్రం­లో సి­ని­మా, మీ­డి­యా మరి­యు టె­క్నా­ల­జీ రం­గాల అభి­వృ­ద్ధి­కి ప్ర­భు­త్వం పూ­ర్తి సహ­కా­రం అం­ది­స్తుం­ద­ని ఆయన భరో­సా ఇచ్చా­రు.

Tags:    

Similar News