24 Nov 2022 6:59 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Andhra Pradesh: ఆక్వా...

Andhra Pradesh: ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ: చంద్రబాబు

Andhra Pradesh: ఆక్వా రైతుల సమస్యలపై ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది.

Andhra Pradesh: ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ: చంద్రబాబు
X

Andhra Pradesh: ఆక్వా రైతుల సమస్యలపై ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ పేరుతో సదస్సు నిర్వహించనున్నారు. కాసేపట్లో అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై సదస్సులో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక ఈ సమావేశానికి ఆక్వా రైతులు, రైతు సంఘం నాయకులు హాజరుకానున్నారు.


టీడీపీ హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం.. నేడు జగన్‌రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్​లో అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Next Story