పవన్ తల తీసేస్తారా.. ఏంటీ దారుణాలు జగన్..

పవన్ తల తీసేస్తారా.. ఏంటీ దారుణాలు జగన్..
X

వైసీపీ బ్యాచ్ దారుణాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. వైసీపీ అండ, జగన్ సపోర్ట్ చూసుకుని చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక మొన్నటి దాకా కులాల మధ్య చిచ్చు రేపాలని చూశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీద పడుతున్నారు. పవన్ కల్యాణ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి.. ఆయన మీద మత పరమైన దాడులు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ మీద ఎన్ని రకాల మత పరమైన ట్రోల్స్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఓ పాస్టర్ బరి తెగించి.. పవన్ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి మాట్లాడితే తల తీసేస్తామంటూ అత్యంత దారుణంగా మాట్లాడారు. ఇది ఎంత దారుణం అసలు. హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఇంత దారుణంగా తల తీసేస్తాం అంటారా. ఇదంతా జగన్ సపోర్ట్ చూసుకునే కదా.

ఇదే పాస్టర్ జగన్ సపోర్ట్ చూసుకుని రెచ్చిపోతున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా జగన్ తరఫున ఎంతగా ప్రచారం చేశారో చూశాం. అంటే ఆయన మాటల వెనకాల జగన్ ఉన్నారనేది క్లియర్ గా అర్థం అవుతోంది. కానీ అదే పవన్ కల్యాణ్ కన్నెర్ర చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌ ఒకసారి ఫోకస్ చేస్తే.. వాళ్ల భరతం పట్టేదాకా వదిలిపెట్టరు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా హుందాగా ప్రవర్తించాలని చూస్తున్నారు.

దాన్నే అలుసుగా చూసుకుని వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతోంది. అలాంటి వైసీపీకి కచ్చితంగా రాజకీయ పరంగా బుద్ధి చెప్పాల్సిందే. ప్రజలు ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారు. హిందూ ధర్మం మీద వైసీపీ ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్నీ చేసేస్తోంది. కానీ ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఆ హద్దులు మొత్తం దాటేస్తోందనే చెప్పుకోవాలి. మరి ఇంకొన్ని రోజులు ఇలాగే వైసీపీ రెచ్చిపోతే మాత్రం కచ్చితంగా ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావని అంటున్నారు ప్రజలు.

Tags

Next Story