రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? : వైసీపీని నిలదీసిన నారా లోకేష్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? : వైసీపీని నిలదీసిన నారా లోకేష్

ఏపీ బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో మాట్లాడారు ఎమ్మెల్సీ నారా లోకేష్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా చెప్పారని.. ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రైతులకు విత్తనాలు ఇచ్చే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని.. వాళ్లను క్యూలైన్లలో నిల్చోబెట్టి చంపేస్తున్నారని దుయ్యబట్టారు లోకేష్. ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో ఇస్తున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 1500 మంది రైతులకు 7 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. వైఎస్ హయాంలో చనిపోయిన 15వేల మంది రైతుల సంగతి మర్చిపోయిందన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 40 లక్షల మందికే అమ్మఒడి పథకం వర్తింపజేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులకూ కోత పెట్టారని లోకేష్ విమర్శించారు. గృహ నిర్మాణానికి, సాగునీటి ప్రాజెక్టులకు, సంక్షేమ రంగానికి నిధులు తగ్గించారన్నారు.

కియా మోటార్స్ వ్యవహా రంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌లో పంచ్‌లు వేశారు లోకేష్. 2007లోనే వైఎస్సార్, కియా కంపెనీని ఏపీకి ఆహ్వానించా రని చెబుతున్నారని, మరి వాళ్లెందుకు రాలేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అని చెప్పడం లేదంటటూ సెటైర్లు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story