ఏంటా రాతలు.. రేణూ దేశాయ్ ఫైర్

పాత జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించింది రేణూ దేశాయ్. అయినా గతాన్ని గుర్తుకు తెస్తూ ఆమెని అలాగే సంభోధిస్తుంటే ఓపిక పట్టింది. తన సహనాన్ని పరీక్షించిన ఓ జర్నలిస్ట్.. మరి కాస్త ముందుకు వెళ్లి మరి కావాలని రాశాడో.. అక్షర దోషమో తెలియదు కానీ రేణూ దేశాయ్ చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. పదే పదే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటే సహించింది. తనకంటూ సొంత ఐడెంటీని క్రియేట్ చేసుకున్నా ఆ విధంగా పిలుస్తుండడం బాధ కలిగించినా మనసు చంపుకుని సర్దుకు పోతోంది. తాను పవన్ పిల్లలకు తల్లిగా ఉంటాను కానీ పవన్ మాజీ భార్యగా మాత్రం ఉండనని.. అలా పిలవడం తనకు నచ్చదని ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. తాజాగా తన ఇద్దరు పిల్లలతో కలిసి జమ్మూలోని శ్రీనగర్‌కు వెళ్లి విహార యాత్రను ఎంజాయ్ చేస్తోంది. ఈ వార్తను ఓ వెబ్ సైట్ కవర్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ పిల్లలతో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్’ అని హెడ్డింగ్ పెట్టి వార్త రాశాడు. అది చూసిన రేణూ దేశాయ్‌కి చిర్రెత్తుకొచ్చింది. వార్త రాసిన వ్యక్తిపై ఫైర్ అయ్యింది. ఆర్టికల్ రాసిన వ్యక్తి కూడా ఓ తల్లికే పుట్టి ఉంటాడు. మరో తల్లిని బాధ పెట్టేలా ఆర్టికల్ రాయకూడదు అంటూ తన బాధను వ్యక్తం చేసింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *