నర్సు మీద కన్నేసిన డాక్టర్‌.. ఆమెను గర్భవతిని చేసి…

ఆయనో పేరు పోయిన డాక్టర్‌. ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంను నడుపుతున్నాడు. పవిత్ర వృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌ ఓ పాడు పని చేశాడు. తన ఆస్పత్రిలో పని చేసే ఓ నర్సుమీద కన్నేసిన ఆ డాక్టర్‌.. మాయ మాటలు చెప్పి లైంగికంగా ఆమెను లోబర్చుకున్నాడు. ఈ విషయం తన భార్యకు తెలియడంతో ఆస్పత్రి నుంచి నర్సును బయటకు పంపించేసింది. అయినా వేరో చోట కాపురం పెట్టించి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. తీర ఆ మహిళ గర్భవతి అని తేలడంతో ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు సదరు వైద్యుడు. నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నేను నీకు అండగా ఉంటానని.. అబార్షన్‌ చేయించుకోవాలని నర్సుపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అబార్షన్‌కు ససేమిరా అంది. దీంతో అబార్షన్‌ చేయించుకుంటే పరిహారం ఇస్తానంటూ రోగికి మందులు రాసే ప్రిస్కిప్షన్‌ మీద హామీ రాసి ఇచ్చాడు. యువతి పేరు మీద 2 లక్షల డిపాజిట్‌ చేస్తానని..100 గజాల స్థలం ఇస్తానని..ఇల్లు కూడా కట్టించి ఇస్తాని..దాంతో పాటు 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొనిస్తానని ఆ చీటిలో రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన హామీల ప్రిస్కిప్షన్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీటికి ఓకే చెప్పిన మహిళ…అబార్షన్‌ కోసం కోదాడలోని ఓ ప్రైవేట్ వైద్యుడిని సంప్రదించింది. అబార్షన్‌ చేయడానికి నిరాకరించిన ఆయన…అసలు విషయం ఆరా తీయగా ఆ యువతి తనకు వైద్యుడు రాసిచ్చిన హామీల చీటిని ఆ డాక్టర్‌కు చూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న మందుల చీటిపై డాక్టర్‌ గారి హామీలను చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి అపవిత్రమైన పని చేయడమెందుకుని ప్రశ్నిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *