స్నేహితురాలిని నది వద్దకు తీసుకెళ్లి..

స్నేహితురాలిని నది వద్దకు తీసుకెళ్లి..

సింథియా హాఫ్‌మన్‌ర్‌‌ను డబ్బు కోసం దారుణంగా హతమార్చాడు. దీంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. ఈ నెల 2న సింథియా హాఫ్‌మన్‌ను వాకింగ్ తీసికెళ్ళి డానియెల్‌ తన స్నేహితులతో కలిసి ఓ నది వద్ద ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. డానియెల్‌ బ్రహ్మెర్‌‌కు గత కొద్ది నెలల క్రితం ఆన్‌లైన్‌లో ఇండియానాకు చెందిన స్కిమిల్లర్‌‌తో పరిచయం ఏర్పడింది. స్కిమిల్లర్‌ తనను తాను టైలర్‌ అనే ఓ బిలయనీర్‌గా పరిచయం చేసుకుని , తనకు బాగా డబ్బుందని బ్రహ్మెర్‌ను నమ్మించాడు. ఇలా వారు తరుచు ఆన్‌లైన్‌ వేదికగా కలుస్తుండే వారు. ఈ క్రమంలో వారు అత్యాచారం, హత్య వంటి అంశాలపై చర్చించుకున్నారు.

ఈ క్రమంలో స్కిమిల్లర్‌.. బ్రహ్మెర్‌‌కు ఓ ఆఫర్ ఇచ్చాడు. ‘నీ బెస్ట్‌ఫ్రెండ్‌ ఎవరినైనా ఆ హత్య చేసి..వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నాకు పంపించు..అందుకు బదులుగా నీకు 9 మిలియన్‌ డాలర్ల సొమ్ము చెల్లిస్తాను’ అని చెప్పాడు. దీంతో డబ్బుకు ఆశపడిన బ్రహ్మెర్‌ మరో నలుగురు స్నేహితులతో కలిసి స్నేహుతురాలి హత్యకు ప్లాన్ చేశాడు. మనోవైకల్యంతో బాధపడుతున్న తన స్నేహుతురాలు 19 ఏళ్ల సింథియా హాఫ్‌మన్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా హాఫ్‌మన్‌ను వాకింగ్‌ వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ నది వద్దకు తీసుకెళ్లి హాఫ్‌మన్‌ నోటికి టేప్‌ వేసి ఆమె తల మీద కాల్చి.. నదిలో పడేశారు.

అనంతరం నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలిని హాఫ్‌మన్‌గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణలో బాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమరాలను పరిశీలించారు. ఆ పుటేజిలో హాఫ్‌మాన్‌తో పాటు బ్రహ్మెర్‌ మిత్రబృందం ఉండటం పోలీసుల గమనించారు. దీంతో అతన్ని విచారించగా నిజాలు వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు హత్యతో సంబంధం ఉన్న బ్రహ్మెర్‌, స్కిమిల్లర్‌తో పాటు.. అతని నలుగురు స్నేహితులను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు బ్రహ్మెర్‌, స్కిమిల్లర్లకు జీవిత ఖైదు విధించింది.

Tags

Read MoreRead Less
Next Story