గాంధీ అలా చెప్పడమే గాడ్సేకు వరమైంది : మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి

మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలందిన వ్యక్తి వి. కళ్యాణం. ఆయన వయసు 98 ఏళ్లు. ఇప్పటికీ ఆయన పనులు ఆయనే సొంతంగా చేసుకుంటారు. బ్రిటీష్ హయాంలో వారి దగ్గర పని చేసిన కళ్యాణం తన 21వ ఏట వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో అడుగుపెట్టారు. బ్రిటీష్ వారి దగ్గర పని చేయడం మూలాన ఆ క్రమ శిక్షణ, సమయపాలన నచ్చి గాంధీ తన దగ్గర నియమించుకున్నారు. 98 ఏళ్ల వయసులోనూ బాపూజీ సిద్ధాంతాలను తు.చ. తప్పక ఆచరిస్తున్న ప్రముఖ గాంధేయవాది. దాదాపు రూ. పదికోట్లు వివిధ ఆస్పత్రులు, సేవా సంస్థలకు విరాళమిచ్చిన దానశీలి. హైదరాబాద్‌కి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ తలపెట్టిన ‘మిషన్‌ కవచ్‌’’ కార్యక్రమ ఆవిష్కరణకు కల్యాణం నగరానికి విచ్చేశారు. బాపూజీ బతికుంటే ఈ ఘోరాలు చూడలేక హే రామ్.. నన్ను తీసుకెళ్లు అని భగవంతుడిని ప్రార్థించేవారేమో అనే కళ్యాణం మాటల్లో మరికొన్ని ఆసక్తికర సంగతులు.. దోపిడీలు, అఘాయిత్యాలు, అకృత్యాలను చూసి బాధపడే బదులు బాపూజీ కన్నుమూయడమే మంచిది కదా.. అలా గాంధీజీకి ప్రశాంతతను చేకూర్చిన గాడ్సేను అభినందించాల్సిందే అని తీవ్ర ఆవేదనతో అన్నారు కళ్యాణం.

జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన చివరి మాట ఏంటి? గాడ్సే ఆయన్ను పదేపదే ఎందుకు టార్గెట్ చేశారు? తన వద్దకు వచ్చేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లోనూ చెక్ చేయవద్దని గాంధీజీ పోలీసులకు ఎందుకు చెప్పారు? పటేల్ ప్రధానిగా ఉంటే బాగుండేదని గాంధీజీ భావించారా? ఆయన కాంగ్రెస్ పార్టీకి సూచించిన పేరు ఏంటి? ప్రస్తుత కాంగ్రెస్ గాంధీజీ సిద్ధాంతాలను ఎప్పుడో మరిచిపోయిందా? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ప్రశ్నలకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం టీవీ5తో పంచుకున్నారు. హైదరాబాద్ వచ్చిన కల్యాణంతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.

గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను. గాంధీ హే రామ్ లేదా హే రహీమ్ అని అనలేదు. గాంధీ హేరామ్ అన్నారని చాలా మంది ప్రచారం చేశారు. గతంలోనూ గాడ్సే 5సార్లు గాంధీపై మర్డర్ అటెంప్ట్ చేశారు. తన వద్దకు వచ్చేవారి జేబుల్ని చెక్ చేయవద్దని గాంధీ పోలీసులకు చెప్పారు..అలా చెప్పడమే గాడ్సేకు వరమైంది. పాకెట్ లో పిస్టోల్ పెట్టుకుని గాడ్సే గాంధీ వద్దకు వచ్చాడు. కాంగ్రెస్ కు లోక్ సేవక్ సంఘ్ అనే పేరును గాంధీజీ సూచించారు. కానీ అప్పటి ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. నెహ్రూని ప్రధానిగా గాంధీజీ ఎంపిక చేయలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీయే నెహ్రూని ఎంపిక చేసింది. పటేల్ ప్రధానిగా ఉండుంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదు. నెహ్రూ ప్రతి సమస్యకూ అమెరికాను సంప్రదించేవారు. ఒకానొక సమయంలో గాంధీ.. పటేల్ ను ప్రధానిగా ఉండమని కోరారు. కానీ ప్రధానిగా ఉండేందుకు పటేల్ ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిపాలన కంటే బ్రిటీష్ రూలే బాగుంది. హిందూ, ముస్లింలను గాంధీజీ సమానంగా చూసేవారని కళ్యాణం చెప్పారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *