తామరపువ్వు భంగిమ.. వీడియో విడుదల చేసిన మోదీ

తామరపువ్వు భంగిమ.. వీడియో విడుదల చేసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో యానిమేటెడ్ యోగా వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా శల భాసనం ఎలా వేయాలో చూపించారు. తామరపువ్వు భంగిమగా పిలిచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మణికట్లు, వెనుక కండరాలు దృఢంగా తయారు కావడానికి, స్పాండిలై టిస్‌ నివారణ వంటి అనేక ప్రయోజనాలు శలభాసనం ద్వారా లభిస్తాయి. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రజలకు యోగాపై ఆసక్తి పెంపొందించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు ట్విటర్లో దాదాపు 10కి పైగా ఆసనాలను పోస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story