సిద్ధూ రాజీనామా ఆమోదం.. వాట్ నెక్ట్స్..

సిద్ధూ రాజీనామా ఆమోదం.. వాట్ నెక్ట్స్..

పంజాబ్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా ఆమోదం పొందింది. సిద్దూ రిజైన్‌ను ఆమోదించినట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. రాజీనామాను ఆమోదించాలంటూ గవర్నర్‌ వీపీఎస్‌ బద్నోర్‌కు సూచించారు. రాజీనామాపై సిద్దూ నుంచి ఎలాంటి రియా క్షన్ లేకపోవడం వల్లే ఆమోదించాల్సి వచ్చిందని అమరీందర్ పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సిద్దూ, అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వైఫల్యానికి సిద్దూనే కారణమని అమరీందర్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సిద్ధూ తీవ్రంగా స్పందించారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించానని, సీఎం వల్లే పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాలేదని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత నెలరోజుల క్రితం సిద్దూ చేపట్టిన పంచాయతీరాజ్‌ సాంస్కృతిక శాఖల బాధ్యతలను తొలగించి, నామమాత్రమైన శాఖలను ఆయనకు అప్పగించారు ముఖ్యమంత్రి.. దీంతో విభేదాలు మరింత ముదిరి రాజీనామాకు దారి తీశాయి. మంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. ముందుగా ఆ లేఖను రాహుల్ గాంధీకి పంపించారు.

దీనిపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు కూడా రాజీనామా లేఖ పంపించారు. అయితే, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నాననేది మాత్రం ఆ లేఖలో పేర్కొనలేదు. రిజైన్‌కు కారణాలేంటో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వ్యవహారంపై ముందుగా ఆశ్చర్యపోయినట్లు మాట్లాడిన ముఖ్యమంత్రి, తాజాగా రాజీనామాకు ఓకే చెప్పారు. ఆ లేఖలో తాను రాజీనామా చేస్తున్న ట్లు ఒకే ఒక్క వాక్యం ఉండడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాని చెప్పారు. ఐతే, సిద్దూ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజీనామాను ఆమోదించక తప్పలేదని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. సిద్దూ రాజీనామా ఆమోదంతో పంజాబ్‌లో రాజకీయం మరో మలుపు తిరిగినట్టయింది. రాజీనామా ఆమోదం పొందడంతో సిద్దూ తదుపరి వ్యూహం ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తుండగా.. పార్టీ వర్గాలు మాత్రం ఎక్కడి వెళ్లరని చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story