ఇంటర్ అర్హతతో హెచ్‌సీఎల్‌లో శిక్షణతో పాటు ఉద్యోగం.. పై చదువులకు అవకాశం..

ఇంటర్ అర్హతతో హెచ్‌సీఎల్‌లో శిక్షణతో పాటు ఉద్యోగం.. పై చదువులకు అవకాశం..

ఇంటర్ పూర్తవుతూనే ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగంతో పాటు పేరున్న ఇనిస్టిట్యూట్‌లో చదువుకునే అవకాశం లభిస్తే విద్యార్థులకు కొంత వెసులు బాటుగా ఉంటుంది. అదే అవకాశాన్ని కల్పిస్తోంది దేశంలోని ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ హెచ్‌సీఎల్. హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా రాణించగలరనే నమ్మకంతో కంపెనీ సరికొత్త కార్యక్రమానికి నడుం బిగించింది. యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేసి మెరుగైన ఫలితాలు వస్తే మిగతా రాష్ట్రాలకు విస్తరించాలని కంపెనీ ఆలోచిస్తోంది. హెచ్‌సీఎల్ కేంద్రాలున్న రాష్ట్రాల్లో కూడా టెక్ బీ ప్రోగ్రాంను ప్రారంభించారు.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలో ఉన్న హెచ్‌సీఎల్ కార్యాలయానికి వెళ్లి వారు నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ తరువాత ఆన్‌లైన్ టెస్టు నిర్వహిస్తారు. ఎంపిక అయిన అభ్యర్థి రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించేందుకు స్థోమత లేని అభ్యర్థులు కంపెనీ బ్యాంకు రుణ సదుపాయం వచ్చే విధంగా సహాయం చేస్తారు. అభ్యర్థికి ఉద్యోగం వచ్చిన తరువాత తొలి ఏడాది నుంచి ఫీజును వాయిదాల రూపంలో చెల్లించాలి. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ స్కోరు చేసిన వారికి పూర్తి స్థాయి రాయితీ ఉంటుంది. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే సంపాదించేలా కార్యాచరణను రూపొందిస్తారు. మొత్తం 12 నెలల కాలం శిక్షణలో రూ.10వేలు స్టయిఫండ్ ఇస్తారు. మొదటి 9 నెలలు క్లాసు రూములో శిక్షణ ఇస్తే, ఆ తరువాత మూడు నెలల ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. ఇక విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంటుంది. శిక్షణ అనంతరం ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది. టెక్ బీ ప్రోగ్రాం పూర్తి చేసిన విద్యార్థులు బిట్స్ పిలానీ నుంచి బీఎస్సీ, ఎంఎస్సీ/ఎంటెక్ క్లాసులకు హాజరు కావచ్చు. వీరికి తరగతులను హెచ్‌సీఎల్ క్యాంపస్‌లోనే నిర్వహిస్తారు. మిగిలిన వివరాలకు వెబ్‌సైట్: www.hcltechbees.com

Tags

Read MoreRead Less
Next Story