క్యాబ్ డ్రైవర్ క్యా బాత్ హై.. చదివింది ఎనిమిది.. మాట్లాడేది..!! వీడియో వైరల్

మాతృభాష తప్పితే మరో భాష రాదే.. కానీ ఎంతిష్టమో ఏదైనా భాష నేర్చుకోవాలంటే.. మాట్లాడుతుంటే అదే వస్తుందండి అంటారు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడే భాషా ప్రేమికులు. పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలంటే పెద్ద చదువులే చదవాలా ఏంటి ఎనిమిదో క్లాసు చదువుకున్నా సరిపోతుందండి అంటున్నాడు బెంగళూరు క్యాబ్ డ్రైవర్. పండితులు, పామరులు మాత్రమే మాట్లాడే సంస్కృత భాషని దంచి కొడుతున్నాడు. భాష నేర్చుకోవడం అనేది కూడా ఓ కళేనండీ అని అంటున్నాడు. సంస్కృత శ్లోకాలు కానీ, పదాలు కానీ చూసి చదవాలన్నా కష్టమే. కానీ అతడు మాట్లాడే ప్రతి పదం ఎంతో స్పష్టంగా ఉంది. ఓ ప్రయాణీకుడితో అతడు సంస్కృతంలో సంభాషిస్తుంటే క్యాబ్ డ్రైవర్ భాషకు ముగ్దుడయ్యాడు.

45 సెకన్ల పాటు అతడు మాట్లాడిన సంస్కృత భాషని వీడియో తీశాడు ప్రయాణీకుడు గిరీష్ భరద్వాజ్. ఏం చదివావు అని అడిగితే 8వతరగతి వరకే సార్ అని చెప్పాడు. మరి సంస్కృతం భాషని ఎక్కడ నేర్చుకున్నావ్ అని అడిగితే.. రాజా రాజస్వా షేహర్ లోని మీడియేషన్ హౌస్‌లో చిన్నప్పుడే తాను సంస్కృత భాషను నేర్చుకున్నట్లు చెప్పాడు. పదేళ్ల నుంచి సంస్కృత భాషలోనే మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ భాషలో తాను చదివిన పుస్తకాల గురించి చెబుతూ.. ఉపనిషద్, భగవద్గీత, ధర్మగ్రంథ లను చదివినట్లు చెప్పాడు. చివరిగా ఆసక్తి ఉండాలే కానీ.. సంస్కృత భాషను ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చని చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 71.7వేల వ్యూస్‌తో పాటు 2 వేల 911 సార్లు రీ ట్వీట్ చేశారు. క్యాబ్ డ్రైవర్‌ని నెటిజన్స్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *