తరగని అందం @ 45.. బాలీవుడ్ బ్యూటీ బికినీ అందాలు

ఎంత వయసు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు మరింత అందంగా కనిపిస్తారు అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తార.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రకటనల్లో నటిస్తూ బిజిగానే ఉంది. ఇటీవలే తన 45వ పుట్టిన రోజు జరుపుకున్న కరిష్మా కుటుంబంతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లింది. అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో అందాలు ఆరబోసింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్స్.. ఈ వయసులో కూడా ఇంత అందంగా.. ఎంత ఫిట్‌‌గా ఉన్నారో అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. మరి కొందరు ఈ వయసులో ఆ డ్రెస్ ఏంటి.. ఆ ఫోజులేంటి అని విమర్శిస్తున్నారు. అయితే ఫోటో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లక్షకు పైగా లైకులు వచ్చాయి. కత్రినా కైఫ్, అమృతా అరోరా, ఆథియా శెట్టి, కియారా అడ్వాణీ వంటి నటీమణులు కూడా కరిష్మా అందానికి ఫిదా అయ్యారు. 2018 వచ్చిన జీరో చిత్రంలో కరిష్మా అతిథి పాత్రలో కనిపించారు.

 

View this post on Instagram

 

Love urself at every age 😇 #nofilter #birthdaymood

A post shared by KK (@therealkarismakapoor) on

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *