తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగరవేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహలు రచిస్తోంది. ఏపీ తెలంగాణలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన కమలనాథులు.... పార్టీని ప్రతి గ్రామానికి చేరుస్తామంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో పార్టీ పటిష్టం చేయడంపై ఆ రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, దత్తాత్రేయ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే.. పార్టీలో చేరికలు, సభ్యత్వ నమోదును పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. spot తెలంగాణలో బీజేపీ సభ్వత్వ నమోదు చురుకుగా సాగుతుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మారుమూల గ్రామాల్లో కూడా బీజేపీ బలం పెంచుకుంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారాయన. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు లక్ష్మణ్‌...

అటు ఏపీలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి... మధ్యప్రదేశ్‌‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరయ్యారు. కోట్ల సంఖ్యలో ఉన్న కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమన్నారు. ఏపీలోనూ సభ్యత్వ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం.. అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు చౌహాన్‌.

అటు... గుంటూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారాయన. అధికారం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదని... ధన, కుల, వర్గ రాజకీయాలకు దూరమన్నారు రాంమాధవ్‌. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ... ఆ దిశగా వేగం పెంచింది. మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story