విధులను పక్కన పెట్టి టిక్‌ టాక్‌లో ఉద్యోగుల డ్యాన్సులు

ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్యోగులు.. తమ విధులను పక్కన పెట్టి టిక్‌ టాక్‌లో టాలెంట్‌ చూపిస్తున్నారు. డ్యాన్సులు.. డైలాగ్‌లతో టికెటాక్‌ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గత కమిషనర్‌ కొందరిని హెచ్చరించారు.. మరికొందరికి నోటీసులు ఇచ్చారు.. అయినా అక్కడి సిబ్బంది వైఖరిలో మార్పు కనిపించడం లేదు.

ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినప్పటి నుంచి ఎన్నో సమస్యల్లో చిక్కుకుంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికార యంత్రాంగంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా అధికారుల సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. ప్రజా సమస్యలను గాలికి వదిలి.. టిక్‌టాక్‌ వీడియోలతో సమయాన్ని వృథా చేస్తున్నారు.

కార్పొరేషన్‌ విభాగాల్లో సానిటేషన్‌, రోడ్లు, డెత్‌, బర్త్‌ సర్టిఫికేట్ల కోసం జనం గగ్గోలు పెడుతున్నా.. నెలల తరబడి సామాన్య ప్రజల్ని తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప పని చేయడం లేదు. తమ పనులకు కోసం అక్కడికి వచ్చే ప్రజలతో.. తాము బిజీగా ఉన్నామని చెబుతూ.. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. కార్పొరేషన్‌ ఉద్యోగులు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.. కొత్త కమిషనర్‌ కల్పించుకుని ప్రజా సమస్యలను పక్కన పెట్టిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు..

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *