మున్సిపల్ ఎన్నికలను ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తారు.? : హైకోర్టు ప్రశ్న

మున్సిపల్ ఎన్నికలను ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తారు.? : హైకోర్టు ప్రశ్న

తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాడ్డాయి. అదే సమయంలో కొత్త మున్సిపల్ చట్టం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే..మున్సిపల్ ఎన్నికలను ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తారు.? వార్డుల విభజన, రిజర్వేషన్లపై అభ్యంతరాలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? ఇదే అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించి హడావుడిగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందనేది పిటీషనర్ల వాదన. వార్డుల విభజన ఓటర్ల సంఖ్య పొంతన లేకుండా ఉందని, రిజర్వేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా ఉదంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో కోర్టులు తెలిపినట్లు 109 రోజుల్లో పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని వివరించింది. జీవో 78తో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని చెప్పింది. అయితే.. గతంలో ఇచ్చిన జీవో కాకుండా హడావుడిగా తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియకు సిద్ధం అయినట్లు పిటీషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పిటీషనర్లు అభ్యంతరానికి కారణమైన కొత్త ఆర్డినెన్స్ చుట్టే శుక్రవారం నాటి వాదనలు కేంద్రీకృతం అయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు సమర్పించారు. అయితే..ప్రభుత్వం తన కౌంటర్‌లో పొందుపరిచిన అంశాల్లో వాస్తవం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఏ ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. పాత ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించి కొత్త ఆర్డినెన్స్‌ సపోర్ట్‌ తీసుకుంటామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే..ప్రబుత్వ కౌంటర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు..ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి 606 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీటన్నింటికి సంబంధించి ఈనెల 21వ తేదీలోగా పూర్తి స్థాయిలో మరొక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story