పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. లేక ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే జర జాగ్రత్త..

పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. లేక ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే జర జాగ్రత్త..

ఆఫర్లు ఊరిస్తున్నాయి. అడక్కుండా అంతేసి డిస్కౌంట్ ఇస్తున్నాయి. మార్కెట్లో వారానికో కొత్త ఫోన్.. మనసు దోచే ఫీచర్లతో. పాత ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందునా బడ్జెట్ కూడా భయపెట్టేటట్లేమీ ఉండదు. ఎక్సేంజ్ ఆఫర్లతో వినియోగదారుడిని మరికొంత ఎట్రాక్ట్ చేస్తుంటాయి మార్కెట్లోకి వచ్చే రోజుకో కొత్త రకం ఫోన్లు. మరి మీ దగ్గరున్న ఫోన్ అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

మీరు ఫోన్ వాడుతుండడం మొదలు పెట్టినప్పటినుంచి మీ ముఖ్యమైన ఫైల్స్ ఫోన్‌లో స్టోర్ అవుతుంటాయి. ఎంత మెమొరీ కార్డు ఉపయోగిస్తున్నా సరే.. కొన్ని ఫైల్స్ ఫోన్‌లో సేవ్ అవుతుంటాయి. అందుకే పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేయడం మరిచిపోవద్దు. టెక్ట్స్, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫొటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ బ్యాకప్ చేసుకోవాలి.

ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని గూగుల్‌లోకి బ్యాకప్ చేయడం మరిచిపోకూడదు. ఫోన్‌లో Settings ఓపెన్ చేసి Accounts సెక్షన్‌లో Google పైన క్లిక్ చేయాలి. మీరు ఏ మెయిల్‌లోకి బ్యాకప్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్‌పైన క్లిక్ చేసి కాంటాక్ట్స్ సింక్ చేయాలి.

ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకున్న తరువాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అంటే మీరు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అలా మారిపోతుంది. దాంతో మీ లాగిన్ వివరాలేవీ అందులో ఉండవు. ఇందుకోసం Settings ఓపెన్ చేసి Backup & reset సెక్షన్‌లో Factory data reset పైన క్లిక్ చేయాలి. ఒక్కసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే హ్యాకర్లు కూడా డేటాను రికవర్ చేయలేరు.

ఫోన్ రీసెట్ చేసిన వెంటనే స్విచ్ఛాఫ్ చేయండి. అకౌంట్ లాగిన్ చేయకుండా ఫోన్ వాడితే ఏం అవుతుందిలే అని అనుకోవద్దు.

మీ పాత ఫోన్ నుంచి సిమ్ కార్డ్, మెమొరీ కార్డ్‌తో పాటు ఇతర యాక్సెసరీస్ ఏవైనా ఉంటే తీసెయ్యాలి.

ఆన్‌లైన్లో మీ ఫోన్ అమ్మాలనుకుంటే ఫోన్ కండీషన్ ఎలా ఉందో డిస్క్రిప్షన్‌లో వివరించాలి. ఫోన్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ముందే చెప్పడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story