ap-locala-bosy-elections

నెల్లూరులో భారీగా బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్‌లు.. సీఈవో వివరణ..

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం రేగింది. ఆత్మకూరు ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు దర్శనమిచ్చాయి. పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కన్పించడంతో స్థానికులు విస్తుపోయారు. వీవీప్యాట్ స్లిప్పులపై సీఈవో వివరణ... Read more »

చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా..

కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి… సీఎం చంద్రబాబు ఈసీ తీరును ఎండగడుతూ ఫిర్యాదు చేయగా… పోటీగా వైసీపీ కూడా ఈసీ గడపతట్టింది… ఏపీలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన... Read more »

పసిబిడ్డతో ధర్నాకు దిగిన తిరుమలనాయుడు భార్య

నెల్లూరు వైసీపీ రూరల్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న దుండగుల దాడిలో తీవ్ర గాయాలకు గురైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు భార్య.. వైసీపీ కార్యాలయం వద్ద పసిబిడ్డతో వచ్చి బైఠాయించింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కన్నీరుమున్నీరైంది. భారీగా... Read more »

టీడీపీ మైనార్టీ నేత స్కార్పియోకు నిప్పు.. అర్థరాత్రి ప్రత్యర్థుల దాడి..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. పోలింగ్ అయిపోయి రోజులు గడుస్తున్నా.. పగలు చల్లారడం లేదు. తాజాగా టీడీపీ మైనార్టీ నాయకుడు ఖాదర్‌కు చెందిన స్కార్పియో వాహనానికి ప్రత్యర్థులు నిప్పుపెట్టారు. తాడిపత్రి పట్టణంలో పోలీసు బందోబస్తు కొనసాగుతున్నా.. ఇలాంటి ఘటనలు... Read more »

కాపుకాచి తిరుమల నాయుడుపై విచక్షణా రహితంగా..

ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తుంటే.. మరో ప్రక్క ఎన్నికలు మిగిల్చిన రాజకీయ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి.నెల్లూరు జిల్లాలో ఎన్నికలు చిన్నచిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. అయితే ఎన్నికలు ముగిసిన మూడు రోజులకు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో... Read more »

వారెవరికీ రాని అనుమానం బాబుకు మాత్రమే ఎందుకు వచ్చింది .. – బీజేపీ

ఈవీఎంలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఎవరెన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రాబోయేది తమ ప్రభుత్వామేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తోందని బీజేపీ... Read more »

విపక్షాల ఆరోపణలకు చంద్రబాబు దీటైన కౌంటర్

ఏపీ ఎన్నికలు ముగియడంతో సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ చేశారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటాన్ని ఉదృతం చేశారు. దేవేగౌడ ఆహ్వానం మేరకు కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈవీఎంలపై ఇప్పటికే బీజేపీ యేతర పక్షాలను... Read more »

కోడెలపై చర్యలు తీసుకోవాలి .. – వైసీపీ

గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎన్నికల రోజు మొదలైన చిచ్చు ఇంకా ఆరలేదు. రెండు పార్టీల నేతలు ఆరోపణ, ప్రత్యారోపణలతో జిల్లాలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పటికే స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పై దాడి చేసిన కేసులో... Read more »

ఏపీ ఎన్నికల్లో వెల్లివిరిసిన మహిళ ఓటర్ల చైతన్యం

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లివెరిసింది. పోలింగ్ సమయంలో అడ్డంకులు ఎదురైనా మహిళా ఓటర్లు ఓపిగ్గా ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఆ సారి 1.36 శాతం ఎక్కువగా మహిళా ఓటింగ్ నమోదైంది. ఓవరాల్ గా... Read more »

రాత్రి 10 గంటల సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరవడంతో కలకలం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరవడంతో కలకలం రేగింది. శనివారం రాత్రి 3 వాహనాల్లో కొన్ని ఈవీఎంలను అధికారులు తరలించారు. అవి రిజర్వ్ ఈవీఎంలేనని, ఆందోళన వద్దని కలెక్టర్ ఇంతియాజ్‌ వివరణ ఇచ్చారు. కృష్ణా యూనివర్సిటీలో 7 నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. శుక్రవారం కలెక్టర్,... Read more »