Telangana Defection Case : పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. ఇదే కంటిన్యూ అవుతుందా..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో పది మందికి క్లీన్ చిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిదికి క్లీన్ చిట్ రాగా.. నిన్న చివరగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు కూడా క్లీన్ చిట్ వచ్చేసింది. దీంతో అటు బీఆర్ ఎస్ ఫైర్ అవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ చేసింది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ లోనే ఉన్నారంటూ స్పీకర్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పది మంది నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. కానీ బీఆర్ ఎస్ కు దూరంగానే ఉంటున్నారు.
అటు గులాబీ పార్టీ వారిని వెంటాడాలని డిసైడ్ అయింది. అందుకే వారిపై పెద్ద ఎత్తున కోర్టుల్లో పోరాడింది. చివరకు స్పీకర్ తీర్పుతో ఆ పది మంది బయటపడ్డారు. కానీ దీన్ని ఎలా చూడాలి అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీన్ని అలుసుగా తీసుకుని రాబోయే రోజుల్లో ఫిరాయింపులు మరింత పెరుగుతాయని కొందరు అంటున్నారు. ఆనీ అలా పార్టీ మారే వారిని బీఆర్ ఎస్ లాగా వెంటాడితే కొంత భయం ఉంటుందని.. వెళ్లడానికి వెనకడుగువేస్తారంటూ ఇంకొందరు చెబుతున్నారు. ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా కేసీఆర్ తన హయాంలోనే ఈ ఫిరాయింపులను మొదలు పెట్టారని.. అక్రమంగా కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిష్టు పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకోలేదా.. అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదా అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు.
Tags
- K. T. Rama Rao
- K. Chandrashekar Rao
- Kadiyam Srihari
- Danam Nagender
- Bharat Rashtra Samithi
- Indian National Congress
- Telangana Politics
- Defection MLAs Case
- Telangana Speaker Verdict
- Party Switching Politics
- BRS vs Congress
- Anti Defection Law India
- Telangana Assembly Controversy
- Political Crisis Telangana
- Telangana News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
