అసలామె తల్లేనా.. మరెందుకు పసిబిడ్డనలా.. వీడియో వైరల్

ఆమె అమ్మ కాదేమో. అమ్మైతే మరీ అంత కఠినంగా ఉండదు. ఒకవేళ కేర్‌ టేకరేమో. కొంచెం కూడా సహనం లేకపోతే ఎందుకు ఆ ఉద్యోగం చేయాలి. ‘ఆమె’కు సహజంగా ఉండాల్సిన లక్షణాలు ఓర్పు, సహనంలాంటివి ఏమైపోయాయి. బిడ్డని ఎందుకు అలా చావబాదుతుంది. ఇదేదో సినిమా షూటింగ్ అన్నట్లు ఇదంతా వీడియో తీసిన ఆ మహానుభావులెవరు. ఇన్ని ప్రశ్నలు మెదడుని తొలిచేస్తుంటాయి ఈ వీడియోని చూసిన ఎవరికైనా.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మనసున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అంత చిన్న బిడ్డని కొట్టడానికి ఆమెకు చేతులు ఎలా వచ్చాయని అనిపించకమానదు. మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఎక్కడైనా మనుషులు ఒక్కలానే ఉంటారని నిరూపిస్తుంది. కఠిన హృదయం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన చిన్నారిని కనికరం లేకుండా కొట్టి కొట్టి చంపేసేలా ఉంది. దెబ్బలకు తాళలేక ఆ చిన్నారికి ఏమైనా అయితే.. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఏంటీ అనేది తెలియదు. ఆమె ఆ పాపకు తల్లా లేక కేర్ టేకరా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియో పోలీసులకు చిక్కడంతో మహిళ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *