ఐఎమ్‌డీబీలో సౌత్ సినిమాలు టాప్ 10లో రావడం చాలా ప్రత్యేకం

ఈ ఏడాది అలా నాలుగు సౌత్ సినిమాలు ఐఎమ్‌డీబీ టాప్‌ 10లో ఫీచర్ అవ్వడం విశేషం
అందులో టాప్ 1 సినిమాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ 8.8 రేటింగ్‌తో నిలిచింది
టాప్ 2 సినిమాగా యశ్ నటించిన 'కేజీఎఫ్ ఛాప్టర్2'కు 8.5 రేటింగ్ దక్కింది
3వ స్థానంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ 8.3 రేటింగ్‌తో ఉంది
టాప్ 4 స్థానంలో మలయాళ చిత్రం ‘హృదయం’ 8.1 రేటింగ్‌తో ఉండడం విశేషం
రాజమౌళి సృష్టించిన అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’కు 8 రేటింగ్‌తో టాప్ 5లో ఉంది
టాప్ 6లో యామి గౌతమ్ నటించిన ‘ఏ థర్స్‌డే’ 7.8 రేటింగ్‌తో ఉంది
టాప్ 7 స్థానంలో అమితాబ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఝండ్’ 7.4 రేటింగ్‌తో ఉంది
టాప్ 8గా అజయ్ దేవగన్ నటించిన ‘రన్ వే 34’ 7.2 రేటింగ్‌తో నిలిచింది
‘పృథ్వీరాజ్’ థియేటర్లలో హిట్ అవ్వకపోయినా ఐఎమ్‌డీబీలో టాప్ 9 ప్లేస్‌ను దక్కించుకుంది
టాప్ 10లో ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ 7 రేటింగ్‌తో నిలిచింది