2. పాదం లేదా బొటనవేలు కింద ఫుట్ అల్సర్స్ వస్తాయి. నొప్పి లేకపోయినా అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్‌కి చూపించాలి.
3. చర్మం పొడిబారడం, పగుళ్లు, పొలుసులు, పొట్టు వంటి మార్పులు సంభవిస్తాయి.
4. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ కాలిస్ మరియు కార్న్స్ అల్సర్లుగా మారుతాయి.
పై సమస్యల నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. మీ చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మందులను క్రమం తప్పకుండా సమయానికి తీసుకోవడం అవసరం.
స్నానం చేసిన తర్వాత మీ పాదాలను ఆరబెట్టుకోవాలి. అనంతరం క్రీమ్ లేదా జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. కాలి వేళ్ల మధ్య ఏమీ రాకుండా జాగ్రత్త వహించండి.
అప్పుడప్పుడు పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచితే మురికి లేకుండా శుభ్రంగా ఉంటాయి. డెడ్ స్కిన్ కూడా ఊడిపోతుంది.
స్వంత వైద్యం పనికిరాదు. గోళ్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. గోరుతో పాటు చర్మం కట్టవకుండా జాగ్రత్త పడాలి.
దూమపానం అలవాటు ఉంటే మానేయడం మంచిది. చెప్పులు లేకుండా నడవడం, బురదలో పని చేయడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
శుభ్రమైన పొడి సాక్స్ ధరించండి. సాక్స్ కాటన్‌‌వి అయితే సౌకర్యవంతంగా ఉంటుంది. మీ పాదాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఉంచండి