మే 15, 1985లో యాంకర్ అనసూయ జన్మించారు. ఆమె సొంత ఊరు నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి. అనసూయకి ఇద్దరు చెల్లెళ్లు. అనసూయ పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ ఆమెకి పవిత్ర అని పెట్టాలనుకుందట.. వాళ్ళ నాన్నగారు వాళ్ల అమ్మగారి పేరు పెట్టాలని అనుకున్నారు.
Happy Birthday Anasuya Bharadwaj
చిన్నప్పటి నుంచి అనసూయ కుటుంబం బాగా రిచ్... వారికి గుర్రాలు కూడా ఉండేవి. అయితే వాళ్ళ నాన్నకు గుర్రపు పందెల వ్యసనం ఉండేదని దానివలన చాలా ఆస్థి పోయిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Happy Birthday Anasuya Bharadwaj
ఆస్తులు పోయాక కొన్నేళ్లపాటు అద్దె ఇంట్లో ఉంటూ చాలా కష్టాలు పడ్డామని. అమ్మ మిషన్ కుట్టి మా స్కూల్ ఫీజ్ కట్టేదని, 50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని అనసూయ చెప్పుకొచ్చింది.
Happy Birthday Anasuya Bharadwaj
ఎంబీఏ హెచ్ఆర్ చేసిన అనసూయ.. ఆ తర్వాత ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేశారు. ఆమె తీసుకున్న మొదటి జీతం రూ. 5 వేలు. అక్కడ జాబ్ చేస్తునప్పుడు సినిమా అవకాశాలు వచ్చాయి కానీ కుటుంబ నేపధ్యం సినిమాది కాకపోవడంతో అవకాశాలను వదులుకుందట.
Happy Birthday Anasuya Bharadwaj
ఆ తర్వాత న్యూస్ రీడర్‌గా మారి మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది అనసూయ..ఆ సమయంలోనే జబర్దస్త్ షోకి యాంకర్ గా అవకాశం వచ్చింది. ఆ షోతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న అనసూయ.. సినిమా అవకాశాలను దక్కించుకుంది.
Happy Birthday Anasuya Bharadwaj
సోషల్‌మీడియాలో ట్రోలింగ్ మొదలైనప్పుడు మొదట్లో కామెంట్లు చూసి బాధపడేదానని.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేసిందట.. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లకి సరైన సమాధానం చెబుతున్నానని అంటుంది అనసూయ.
Happy Birthday Anasuya Bharadwaj
ఆర్య సినిమా సమయంలోనే సుకుమార్ తో పరిచయం ఏర్పడిందట.. ఆ సినిమాలో ఓ అవకాశం కూడా ఇచ్చారట.. ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేశానని, కానీ ఇంతమంచి పేరు వస్తుందని ఉహించలేదట
Happy Birthday Anasuya Bharadwaj
ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్సీసీ పరేడ్ కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడు సుశాంక్ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి తొమ్మిదేళ్లపాటు ప్రేమ పోరాటం చేసి సుశాంక్ ని వివాహం చేసుకున్నారు అనసూయ.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
Happy Birthday Anasuya Bharadwaj
అనసూయకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన ఇంట్లో శునకాలతోపాటు చిలుకల్నీ పెంచుకుంటున్నారు.
Happy Birthday Anasuya Bharadwaj
ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్ తాగి.. ఆ బాధనంతటిని తన భర్త ముందు చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతారట అనసూయ.!