ఆపిల్, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్ మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ABC డ్రింక్‌ని మిరాకిల్ డ్రింక్ అని కూడా పిలుస్తారు, ఇది అవసరమైన విటమిన్లు మరియు పోషకాలతో నిండి ఉంటుంది.
ఈ పానీయంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగులలోని విష పదార్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
ఈ ABC డ్రింక్ మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ కూరగాయలలో ఉండే విటమిన్ ఎ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
బీట్‌రూట్, క్యారెట్‌లలో ఉండే బీటా కెరోటిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
యాపిల్స్ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ABC జ్యూస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ABC జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా, అలెర్జీల బారిన పడకుండా చేస్తుంది.
బీట్‌రూట్‌, క్యారెట్‌, యాపిల్‌ పీల్ చేసిన చిన్న ముక్కలుగా కట్‌ చేసి మిక్సీ వేయాలి. రసం వడకట్టి రుచి కోసం కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి.