బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పైన మెరుస్తుంది అనసూయ
అనసూయని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతలా ట్రోల్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వాటిని డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతుంది ఈ రంగమ్మత్త.
ఇదిలావుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అనే పాటలో నటించకపోవడానికి కారణాన్ని వెల్లడించింది.
తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని, ఓసారి అర్థరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది అనసూయ.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.