అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది నటి రష్మిక మందన్నా.. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలు నిజంగానే రష్మిక గుండు కొట్టించుకుందా అని అనుమానం ఆమె అభిమానుల్లో కలిగింది. దీనిపైన సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా అసలు విషయం బయటపడింది.
ఇంతకీ విషయం ఏంటంటే...తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు కనిపిస్తున్నాయి.
తమ వ్యాపారం కోసం ఇలా రష్మిక ఫోటోను వాడుకుంటారా అని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా మరోవైపు రష్మిక గుండు ఫోటోలతో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు.
రష్మికలాగే గతంలో కీర్తి సురుష్‌, నయనతారతో పాటుగా పలువురు టాప్‌ హీరోయిన్ల గుండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా తమిళంలో రష్మిక నటించిన తొలి చిత్రం సుల్తాన్‌ చిత్రం బాక్స్‌ఫీస్‌ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ