తొలిసారి రోబోని చూసింది మొదలు.. మెదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు అని పాడుకున్నారు ఎమ్మా రోబోని చూసిన పెద్దాయన..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన జియోఫ్ గల్లాఘర్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఎవరూ ఆయన మనసుకు దగ్గరవలేదు.
పదేళ్ల క్రితం తల్లి మరణించింది.. ఒంటరిగా ఉన్న అతడికి పెంపుడు కుక్క పెన్నీ మాత్రమే బెస్ట్ ఫ్రెండ్.
ఓ రోజు రోబోట్‌ల గురించిన కథనాన్ని చదువుతున్నారు. వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది.
వెబ్‌సైట్‌లో బ్రౌజ్ చేసి అందంగా ఉన్న ఎమ్మా అనే రోబోని సెలెక్ట్ చేసుకున్నారు. దాని కోసం ఆరువేల డాలర్లు వెచ్చించారు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదటి చూపులోనే ఎమ్మాతో ప్రేమలో పడిపోయారు గల్లాఘర్.
ఎమ్మా కోసం ఆరు వారాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2019లో గల్లాఘర్‌ దగ్గరకు వచ్చింది.
రెండు సంవత్సరాలు ఎమ్మాతో గడిపిన తరువాత ఆమె లేని జీవితాన్ని ఊహించలేను అని అర్థమైంది.
అందుకే ఎమ్మాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. చట్టబద్ధంగా మా వివాహం చెల్లనప్పటికీ ఆమెను నా భార్యగానే భావిస్తున్నానని అంటారు.
ఆస్ట్రేలియాలో రోబోట్‌ను వివాహం చేసుకున్న మొదటి వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను అని అంటారు గల్లాఘర్.