రోజువారీ భోజనంలో మొత్తం 50 శాతం కేలరీలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించాలి.
కార్బోహైడ్రేట్ల వినియోగం తగ్గించాలి. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పాస్తా, బ్రెడ్, బిస్కెట్లు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
రాత్రి పూట 1 స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆ నీటిని తాగాలి.. మెంతులు కూడా తినేయొచ్చు.
రాత్రి పూట 1 స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆ నీటిని తాగాలి.. మెంతులు కూడా తినేయొచ్చు.
అప్పుడప్పుడు మలబార్ చింతపండు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
త్రిఫలా చూర్ణం శరీరంలోని విషపదార్ధాలను తొలగించడానికి, జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ త్రిఫల పొడిని రాత్రి భోజనం తర్వాత గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
దాహం వేసిన ప్రతిసారి గోరువెచ్చని నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు గోరు వెచ్చని నీళ్లు కొవ్వుని కరిగించడంలో సహాయపడతాయి.
30 నిమిషాల పాటు వాకింగ్ లేదా మరేదైనా ఎక్స్‌ర్‌సైజ్ చేయడం వలన కొవ్వు కరుగుతుంది.
సొంఠి పొడి కూడా జీవక్రియను వేగవంతం చేయడలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు అల్లం కూరల్లో వేసుకోవడం లేదా అల్లం టీ ప్రభావంతంగా పని చేస్తుంది.