`అఖండ` ఘనవిజయంలో సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే సినిమాకి కూడా తమనే మ్యూజిక్ చేస్తున్నాడు
అయితే తమన్‌కి బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్లో చేయబోయే సినిమాకి కూడా తమన్ పేరునే పరిశీలిస్తున్నారట.
గత రెండు దశాబ్దాల కాలంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మకి తప్ప మరే సంగీత దర్శకుడికి బాలయ్యతో మూడు వరుస చిత్రాలకు పనిచేసే అవకాశం దక్కలేదు.
గురువు మణిశర్మ బాటలోనే శిష్యుడు తమన్ కూడా బాలయ్య కాంబోలో వరుస చిత్రాలు చేయబోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.