ఘుమఘుమలాడే బిర్యానీకి మంచి రుచి రావాలంటే ఈ ఆకు పడాల్సిందే.. నిజానికి మసాల వంటలు ఏది చేసినా బిర్యానీ ఆకు పడితే ఆ రుచే వేరు..
బిర్యానీ ఆకు ఔషధంగాను ఉపయోగపడుతుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
బిర్యానీ ఆకుతో టీ తయారు చేసుకుని తాగితే జీర్ణక్రియకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, బి6, ఐరన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి.
బే ఆకు ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన శరీరాన్ని ఇన్‌ఫ్లమేషన్ నుండి కాపాడతాయి.
బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కలిపి తయారు చేసిన టీ రోజూ తీసుకుంటే శరీరంలో అధికంగా పేరుకున్న కొలెస్ట్రాల్ కరుగుతుంది.
దాల్చిన చెక్క కడుపులో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అర టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి, ఒక బిర్యానీ ఆకు 2 కప్పుల నీటిలో వేసి మరగబెట్టాలి.. దీనిని వడగట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి.
బే లీఫ్ టీ ప్రతి రోజూ తీసుకుంటే మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.